సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ….

పేదలకు వైద్య సేవలు భారం కావద్దని. సీఎంఆర్ఎఫ్…
టిఆర్ఎస్ పార్టీ వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి…
వెంకటాపూర్(రామప్ప), సెప్టెంబర్07(జనం సాక్షి):-
ములుగు జిల్లా వెంకటాపూర్
మండల కేంద్రం లో
నల్లగుంట గ్రామం లో సీఎం సహాయం చెక్కులను ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ నియోజకవర్గ ఇన్చార్జ్ తెరాస జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్  సహాయ సహకారంతో వెంకటాపూర్ మండలంలోని వెంకటాపూర్ కమ్మరి వాడకు చెందిన కె రాజమౌళి 57,500,నల్లగుంట గ్రామానికి చెందిన ఎం. లత.22,500 రూపాయల చెక్కులను వెంకటాపూర్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి వెంకటాపూర్ ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య తో కలిసి లబ్ధిదారునికి అందజేశారు.
అనంతరం మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలు భారం కావద్దని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరంల మారిందని ఆయన కొనియాడారు దరఖాస్తు చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం హయాంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని అర్హులైన పేద ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మెడబోయిన అశోక్,నల్లకుంట గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి,వెంకటాపూర్ సొసైటీ అధ్యక్షులు కాసర్ల కుమార్,వెంకటాపూర్ మండలం కో ఆప్షన్ సభ్యులు జహీర్ భాష, వెంకటాపూర్ ఎంపీటీసీ పోశాల అనిత వీరమల్లు గౌడ్,వెంకటాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు నర్ర భద్రయ్య,రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు కూరెళ్ళ రామాచారి,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు రామిండ్ల రాజేందర్,మండల యూత్ అధ్యక్షులు దాసరి రమేష్, నల్లగుంట ఉపసర్పంచ్ శంకర్,వెంకటాపూర్ మాజీ సర్పంచ్ సాద యాదగిరి,ములుగు జిల్లా యువజన నాయకులు చీకుర్తి మధు యాదవ్,నూనె రమేష్,కూరెళ్ళ సాంబయ్య,అల్లపు రవి, లేగల చిన్న సాంబయ్య,వివో లీడర్ నాగమణి,బుర్ర సదానందం,మూడేళ్ల ప్రభాకర్,బల్ల సునీత,అంబటి శ్రీలత, ప్రముఖులు టిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.