సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ తెరాస

మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య

పెద్దవంగర నవంబర్ 01(జనం సాక్షి )పేదల ఆరోగ్యం గురించి, పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పథకాలను కెసిఆర్ ప్రజలకు అందజేస్తున్నా ఏకైక ముఖ్యమంత్రి అని, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నాడు. మంగళవారం
మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పడమటి తండా కు చెందిన ధరవత్ బిక్న కు 42500 రూపాయలు ముఖ్యమంత్రి సహయనిధి చెక్కును పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, పడమటి తండా సర్పంచ్ ధరవత్ రాజేందర్,మండల అధికార ప్రతినిధి బానోత్ సోమన్న,పడమటి తండా పార్టీ అధ్యక్షులు ధరవత్ బుజ్జమ్మ, పెద్దవంగర జెడ్ పి ఎస్ ఎస్ విద్య కమిటీ చైర్మన్ సుంకరి అంజయ్య, పడమటి తండా యూత్ అధ్యక్షులు బానోత్ మైబు, నాయకులు రాయరాపు స్వామి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు