సీఎం సహాయనిధి పేదలకు ఆపద్బాంధవుడు – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి


హుజూర్ నగర్ నవంబర్ 12 (జనం సాక్షి): ఆపదలో సీఎం సహాయనిధి పేదలకు ఆపద్బాంధవునిగా ఉంటుందని స్థానిక శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రిగూడెం గ్రామానికి చెందిన కడియం వీరస్వామికి ఆసుపత్రి బిల్లు ఖర్చు 60,000/- ల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మర్రిగూడెం సర్పంచ్ గళ్ల సైదులు, మండల పార్టీ అధ్యక్షుడు ముడెం గోపిరెడ్డి, రైతు సంఘం సమన్వయ జిల్లా కమిటీ సభ్యులు చావా వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ నబీ, గ్రామ పార్టీ ముజిబ్, వార్డ్ సభ్యులు తోట బిక్షం, అభిమల్ల నాగరాజు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.