సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

* వైద్యాధికారి మల్యాల అరుణ్ కుమార్,
ఖానాపురం ఆగష్టు 27జనం సాక్షి
 సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మల్యాల అరుణ్ కుమార్ అన్నారు. శనివారం మండలంలోని  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకుఅశోక్ నగర్ సబ్ సెంటర్ లోని చిలుకమనగర్లో,
  అశోక్ నగర్ లోని కస్తూరిబా స్కూల్లో విద్యార్థులకు పరీక్షలు,ఖానాపూర్ సబ్ సెంటర్ పరిధిలోని మనుబోతుల గడ్డ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిసుమారు 260 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమం అశోక్ నగర్ వైద్యురాలు డాక్టర్ జయసుధ, మునుబోతుల గడ్డ గ్రామ సర్పంచ్ సోమయ్య,ఏఎన్ఎంలు  సునీత, విజయ రాణి, విజయ రమ,రమ్య,ఆశాలు
పార్వతి,భారతి,దేవేంద్ర,పద్మ,సునీతతదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు