సీజనల్ వ్యాధుల పట్ల విస్తృతంగా వైద్య శిబిరాలు

టేకులపల్లి, ఆగస్టు 10( జనం సాక్షి ): ఏజెన్సీ ప్రాంతమైన టేకులపల్లి మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అప్రమత్తమై ప్రతిరోజు గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతలను పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం సులానగర్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆదేశానుసారం వైద్య సిబ్బంది సంపత్ నగర్ గ్రామం లో, గంగారం ఆశ్రమ పాఠశాల లో వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాలలో మొత్తం 63 మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తగిన మందులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి యాంటీ లార్వా, తీమోఫాస్ చల్లించడం స్పేస్ స్ప్రే చేపించారు. ముఖ్యంగా ఈ సీజన్లో ఇంటి పరిసరాలు అత్యంత పరిశుభ్రంగా ఉంచుకొని నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని,దోమలు పుట్టకుండా,కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,వేడి ఆహార పదార్థాలు భుజించాలని,సాధ్యమైనంత వరకు ఇంటిలో తయారుచేసిన ఆహార పదార్థాలనే భుజించాలని,20 నిమిషాలు కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల ఈ సీజన్లో వచ్చే టైఫాయిడ్ కామెర్లు, వాంతులు, విరోచనాలు లాంటి వ్యాధులు బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని రోగులకు టీ హబ్ ద్వారా అవసరాన్ని బట్టి 134 రకాల ఖరీదైన రక్త పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని దీనిని ఉపయోగించుకోవాలని తెలిపారు. అలాగే కండ్ల కలక వ్యాధి అత్యంత సులభంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పదేపదే చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిం

తాజావార్తలు