సీతారాంపూర్ కార్పొరేటర్ ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి –
బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షుడు పాదం శివరాజ్
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 15(జనం సాక్షి)
21వ డివిజన్ సీతారాంపూర్ లో మూడు ఇళ్లను కూలగొట్టిన ఘటనపై కార్పొరేటర్ జంగిలి సాగర్పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
శనివారం నగరంలోని ప్రెస్భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షుడు పాదం శివరాజ్ మాట్లాడుతూ ఇటీవల అర్ధరాత్రి సీతారాంపూర్లో కొట్టె రాజయ్య ఇండ్లను అక్రమంగా జేసీబీ కార్పొరేటర్ కూలగొట్టించడం దారుణమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇతను ఇదివరకే ఎన్నో అవినీతి, అక్రమాలు చేస్తున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోవడం. లేదని, గతంలో గ్రామ పంచాయతీ నిధులు 70 లక్షలు అవినీతి చేశాడని రుజువైనా కూడా ఎలాంటి చర్యలు లేవు, మాజీ సైనికుడి భూమిని కబ్జా చేసిన ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. ఇటీవల జరిగిన కేఆర్ గార్డెన్స్ యజమానిపై కార్పొరేటర్ దాడి చేపించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మంత్రి అండ ఉందని కార్పొరేటర్ ఆగడాలు హద్దు మీరుతున్నాయన్నారు. మొదట్లోనే మంత్రిగాని, అధికారులుగాని చర్యలు తీసుకుంటే ఈరోజు అమాయక ప్రజలపై ఇంత దారుణాలు జరిగేవి కావని అన్నారు. సీతారాంపూర్లో ఇల్లు కట్టుకోవాలంటే కార్పొరేటర్కు వాటా, ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. చాలామంది ప్రజలు బయటకు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై మున్సిపల్, పోలీసుశాఖాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, మంత్రిగారు ఇలాంటి వారికి వత్తాసు పలకడంతో ఇంతటి దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. ఇకముందు ఇలాంటివి జరిగితే సహించేది లేదని, బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని, రాష్ట్ర పార్టీకి వివరించి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వొడ్నాల కోటేశ్వర్, కైలాస నవీన్, దళితమోర్చా అధ్యక్షుడు జక్కుల నిఖిల్, యువమోర్చా ప్రధాన కార్యదర్శి వినయ్, కార్యదర్శి కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.