సీతారామ ప్రాజెక్టు మీదా అధికారులతో , ప్రజాప్రతినిధులతో వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ఎమ్మెల్యే ప్రెస్ మీటింగ్ ఏర్పాటు .
ది.10/09/2022శనివారం వైరా (జనం సాక్షి న్యూస్)
ఈరోజు వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మన ప్రియతమ వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ గారు అధికారులతో సీతారామ ప్రాజెక్టు మీద సంబంధిత అధికారులతో ప్రజాప్రతినిధులతో ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా దృష్టి పెట్టి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగునీరు మరియు తాగునీరు అందించడానికి సీతారామ ప్రాజెక్టు చేపట్టారు .కానీ కొంతవరకు పనులు జరిగిన సంగతి తెలిసినది, ఈ మధ్యకాలంలో సీతారామ ప్రాజెక్టు కొంత నతనడకన నడుస్తున్న సంగతి విషయాన్ని మన ప్రియతమ వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ శాసనసభ సమావేశాల సందర్భంగా ఈనెల 6 వ తారీకు ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యక్షంగా కలిసి సీతారామ ప్రాజెక్టు గురించి ,ఆ పనులు యొక్క అభివృద్ధిని తెలియజేశారు, వెంటనే స్పందించిన ముఖ్యమంత్రివర్యులు ప్రియతమ ఎమ్మెల్యే వెంటబెట్టుకొని సంబంధిత అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్స్ స్మిత సబర్వాల్ వారి యొక్క అధికారులతో శాసనసభ్యులు వారిని తో కలసి చర్చించి వెంటనే పెండింగ్లో ఉన్న 13వ ప్యాకేజీ కు సంబంధించి జీవోను విడుదల చేయడం . ఈ సందర్భంగా మన ప్రియతమ శాసనసభ్యులు వైరా నియోజకవర్గ ప్రజలు రైతులు తరఫున ముఖ్యమంత్రివర్యులుకు కృతజ్ఞతలు తెలియజేశారు.జరిగింది. దీని ద్వారా రాబోయే రోజులలో టెండర్లు పిలిచి వచ్చే జూన్ మాసంకల్లా రైతులు అందరికీ కూడా ముఖ్యంగా వైరా నియోజకవర్గ పరిధిలోని సుమారుగా 52 వేల ఎకరాలకు సంబంధిత రైతులకు నీరు అందించడం జరుగుతుందని తెలియజేశారు. అంతేకాదు ఈ వైరా నియోజకవర్గంలో 28.82 కిలోమీటర్లు పరిధి సీతారామ ప్రాజెక్టు ప్రవహిస్తుందని దానికి సంబంధించిన అతి త్వరలోనే ప్రజలందరికీ ప్రియతమ ముఖ్యమంత్రి వారిచేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేస్తారని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వైరా ఇరిగేషన్ ప్రాజెక్టు EE శ్రీనివాసచార్యులు, కొత్తగూడెం EE అర్జున్ ,కొత్తగూడెం డి ఈ చంద్రశేఖర్ , సింగరేణి డి ఇ వెంకన్న మాట్లాడుతూ దానికి సంబంధించిన వివరాలను ,విడుదలైన జీవోలు సుమారుగా 620 కోట్లతో చేపడుతున్నటువంటి ఈ అభివృద్ధి పనులు కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ మున్సిపల్ చైర్ పర్సన్ సూతకాని జైపాల్, మార్కెట్ చైర్మన్ బీడీ కే రత్నం, రైతు సమన్వయ సమితి కన్వీనర్ మిట్టపల్లి నాగేశ్వరరావు ,ఏనుకూరు రైతు సమన్వయ సమితి కన్వీనర్ ధర్మ , వైరా పట్టణ అధ్యక్షులు దార్న రాజశేఖర్ ,చాపల సొసైటీ అధ్యక్షులు ఎస్ కే రహీం ,పట్టణ నాయకులు మోటపోతుల సురేష్, మండల యువజన నాయకులు శివాజీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు