సీనియర్‌ కన్నడనటుడు సుదర్శన్‌ కన్నుమూత

బెంగళూరు,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ప్రముఖ కన్నడ సీనియర్‌ నటుడు, నిర్మాత ఆర్‌ ఎన్‌ సుదర్శన్‌ (78) అనారోగ్యం కారణంగా శుక్రవరాం సాయంత్రం కన్నుమూశారు. గత వారం కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఆసుపత్రిలో చేరారు. సుదర్శన్‌ భార్య శైలశ్రీ నటిగా సుపరిచితం. 21 వయస్సులో ఉన్నప్పుడే సినీ పరిశ్రమకు వచ్చిన సుదర్శన్‌ దాదాపు 60 సినిమాలలో నటించారు. తెలుగు, తమిళ భాషలలోను పలు సినిమాలు చేసిన ఈయన వయస్సు పై బడిన తర్వాత కన్నడ చిత్రాలలో సపోర్టింగ్‌ రోల్స్‌ పోషించారు. పలు టీవి షోస్‌ లోను పాల్గొన్న సుదర్శన్‌ తన సినిమాలలో పాటలు కూడా పాడాడు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి ఫాదర్‌ గా పిలవబడే ఆర్‌ నాగేంద్ర రావు తనయుడిగా ఉన్న సుదర్శన్‌ నిర్మాతగా కూడా రాణించారు. సుదర్శన్‌ సోదరుడు ఆర్‌ ఎన్‌ జయగోపాల్‌ పాపులర్‌ లిరిసిస్ట్‌గా ఉండగా, మరో సోదరుడు ఆర్‌ ఎన్‌ కె ప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌ గా ఉన్నారు. జయగోపాల్‌ 2008లో మరణించగా, ప్రసాద్‌ 2012లో తనువు చాలించారు. సుదర్శన్‌ 2010లో హీరో ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్‌’ చిత్రంతో సందర్శన్‌ చివరిసారిగా నటించారు. కమల్‌ నటించిన నాయగన్‌ చిత్రంలోను ప్రతినాయక పాత్ర పోషించి అందరి మనసులు గెలుచుకున్నారు సుదర్శన్‌. ఆయన మృతికి కన్నడ సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది.