సీపీఎం ప్లీనం..భారీ బహిరంగ సభ..

66కోల్ కతా : ప్రతి అడుగూ ప్రజాఉద్యమాల వైపే…ప్రతీ నినాదం ప్రజల పక్షమే.. మిత్రపక్షమైనా..ప్రతిపక్షమైనా ప్రజాసమస్యల విషయానికొస్తే పాలకులపై సమరశంఖమే. ప్రజాపోరాటాలే ఊపిరిగా నిత్యం ప్రజలతోనే మమేకమైన కామ్రేడ్లు ఇప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. కోల్‌కతాలో ఆదివారం నుండి 31వ తేదీ వరకు జరగనున్న సీపీఎం నిర్మాణ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.
ప్లీనరీ సమావేశాలకు ముందు కోల్‌కతా నగరంలో సీపీఎం భారీ ర్యాలీ నిర్వహించింది. అరుణ పతాకాలతో ఎర్రసైన్యం కోల్‌కతా నగరంలో కదం తొక్కింది. వివిధ రాష్ర్టాల నుంచి తరలొచ్చిన సీపీఎం కార్యకర్తలు కోల్‌కతా నగరంలో కవాతు నిర్వహించారు. నగరంలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అంతకంటే ముందు పార్టీ జెండాను బెంగల్ లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ బిమన్ బసు ఆవిష్కరించారు. బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కరత్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ తదితరులు పాల్గొన్నారు.