సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయిరెడ్డి
హైదరాబాద్, జనంసాక్షి: క్విడ్‌ప్రోకో కేసులో ఆడిటర్ విజయం సాయిరెడ్డి సోమవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఇదే కేసులో శ్రీనివాసరెడ్డి. ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు రోడ్లు భవనాల శాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హాజరుకు న్యాస్థానం మినహాయింపు ఇచ్చింది.