సీబీఐ డైరెక్టర్ క్షమాపణలు చెప్పాలి: సురవరం
హైదరాబాద్: రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బన్సల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సీబీఐ డైరెక్టర్ మాట్లాడడాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తప్పుబట్టారు. కేసు ప్రాథమిక దశలోనే రంజిత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు కేసును నీరుగార్చేలా ఉన్నాయని విమర్శించారు. ఆయన తొందరపాటు వ్యాఖ్యల వెనక ప్రభుత్వ ఒత్తిడి ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రంజిత్ సిన్హా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను పదవుల నుంచి తొలగించాలి కోరారు.