సీబీఐ ప్రతిష్టను కాపాడేందుకు..  కేంద్రం ప్రయత్నిస్తోంది


– ఇద్దరిపైనా సిట్‌ దర్యాప్తు చేస్తుంది
న్యూఢిల్లీ, అక్టోబర్‌24(జ‌నంసాక్షి) : సీబీఐ ప్రతిష్ఠను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర  ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు అధికారులు (సీబీఐ డైరెక్టర్‌, స్పెషల్‌ డైరెక్టర్‌) పరస్సరం ఆరోపణలు చేసుకున్నందున నిస్పక్షపాతంగా విచారణ జరిగాలని మంగళవారం భేటీ అయిన సీవీసీ నిర్ణయించిందని జైట్లీ చెప్పారు. సీవీసీ తీసుకున్న నిర్ణయాలను అమలు పర్చేందుకే తాము ఉత్తర్వులు జారీ చేశామని ఆయన చెప్పారు. ఇద్దరు ఉన్నతాధికారులను  సెలవుపై పంపుతున్నామని, ఇది కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని మంత్రి అన్నారు. సిట్‌ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తోందో సీబీఐనే నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. సీబీఐ ప్రతిష్ఠ కాపాడేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే.. విపక్షాలు అనవసరంగా తమపై రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.