సుంకాలపై ట్రంప్‌ కీలక నిర్ణయం..

` టారిఫ్‌ల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపు
` దీంతో వినియోగదారులతో పాటు యాపిల్‌, శాంసంగ్‌ వంటి దిగ్గజ సంస్థలకు భారీ ఊరట
వాషింగ్టన్‌(జనంసాక్షి): సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్‌ల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపు ఇచ్చారు. దీంతో వినియోగదారులతో పాటు యాపిల్‌, శాంసంగ్‌ వంటి దిగ్గజ సంస్థలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ గైడ్‌లెన్స్‌ జారీ చేసింది. మరోవైపు.. అమెరికా, చైనా టారిఫ్‌ పోరు మరింత ముదిరిన సంగతి తెలిసిందే. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరినట్టు అమెరికా ప్రకటించింది. ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను 84 నుంచి 125 శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా కస్టమ్స్‌ టారిఫ్‌ కమిషన్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడిరచింది. అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది.భారత్‌ సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు ట్రంప్‌ తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే. చైనాపై మాత్రం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం ఫెంటానిల్‌ సుంకంతో కలిపి అది 145 శాతానికి చేరినట్టు వైట్‌హౌస్‌ స్పష్టతనిచ్చిం

 

‘అణు’ చర్చలు షురూ..
` ఒమన్‌ వేదికగా ఇరాన్‌, అమెరికాల ప్రతినిధుల భేటీ
జనంసాక్షి: ‘అణు’ చర్చల విషయంలో అమెరికా ఇరాన్‌లు ముందడుగేశాయి. ఇరుదేశాల ప్రతినిధులు శనివారం ఒమన్‌ వేదికగా సమావేశమయ్యారు. తొలివిడత చర్చలు ముగిశాయని, ఇరుపక్షాలు వచ్చే వారం మరిన్ని చర్చలు నిర్వహించనున్నట్లు ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడిరచింది. ఒమన్‌ విదేశాంగ మంత్రి సమక్షంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్కాఫ్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చిలు క్లుప్తంగా మాట్లాడుకున్నారని తెలిపింది. దశాబ్దాలుగా వివాదాలు కొనసాగుతున్న వేళ.. ఇరుదేశాల ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష సంభాషణను ఇది సూచిస్తోంది.ఒమన్‌ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన చర్చలు.. సాయంత్రం 5.50 వరకు కొనసాగినట్లు సమాచారం. పరోక్ష చర్చలు ప్రారంభమైనట్లు ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘేయి ధ్రువీకరించారు. తమ దేశ ప్రయోజనాలు కాపాడుకోవడమే అత్యంత ముఖ్యమన్నారు. ఇదిలా ఉండగా.. న్యూక్లియర్‌ డీల్‌ను అంగీకరించకపోతే సైనిక చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అదే జరిగితే ఎదురుదాడులకు వెనకాడబోమని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ సైతం తెలిపారు.ట్రంప్‌ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్‌తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణుఒప్పందం నుంచి అగ్రరాజ్యం వైదొలిగింది. టెహ్రాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్‌ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇరాన్‌తో చర్చలు జరిపేందుకే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. అయితే, ప్రత్యక్ష చర్చలకే ముందుకొస్తామని పెజెష్కియాన్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే తొలి భేటీ జరిగింది