సునావిూ హెచ్చరికలు ఉపసంహరించుకున్న జపాన్
టోక్యో,ఫిబ్రవరి17(జనంసాక్షి ): ఉత్తర జపాన్‌లో అధికారులు సునావిూ హెచ్చరికలను ఉపసంహరించారు. టోక్యోకు 600 కిలోవిూటర్ల దూరంలో సముద్రంలో 6.9 తీవ్రతతో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. తీరంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో అధికారులు సునావిూ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించారు. స్థానిక విూడియా కథనాల ప్రకారం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పరిస్థితి కుదుటపడడంతో జపాన్ ప్రభుత్వం ఉత్తర జపాన్ ప్రాంతంలో సునావిూ హెచ్చరికలను ఉపసంహరించుకుంది. హవాయ్‌లోని పసిఫిక్ సునావిూ హెచ్చరికల కేంద్రం పసిఫిక్ తీరప్రాంతంలో సునావిూ ప్రభావం ఏవిూ లేదని తెలిపింది. అయితే ఉదయం భూకంపం రావడం, అలలు ఎగసి పడడంతో సునావిూ భయం ఉందని భావించారు. దీంతో జపాన్ లో మళ్లీ సునామి భయాందోళనకు గురి చేసింది.ఈ సునావిూ నష్టాలు కలిగించకుండా పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జపాన్ వద్ద సముద్రంలో పది కిలోవిూటర్ల లోతున సునావిూ సంభవించినట్లు ప్రకటించారు. సునావిూనిదృష్టిలో ఉంచుకుని 20 వేల మందిని జపాన్ ఖాళీ చేయించింది.అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది .గతసారి జపాన్ సునావిూకి గురి అయినప్పుడు సుమారు పద్దెనిమిది వేల మంది మృత్యువాత పడ్డారు.అణువిద్యుత్ కేంద్రం కూడా దెబ్బతింది.ఈసారి అలాంటి ప్రమాదాలు లేకుండా పోవడంతో ప్రజలు ఉపశమనం పొందారు.