సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్షయాన్
వాషింగ్టన్: రికార్డు స్థాయి లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా మిలియమ్స్‌ట(46) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఇంజనీర్లు యూరీ మెలాన్‌చెంకో(రష్యా), అకిహిటో హోషిడే(జపాన్)లతో కలిసి జులై 14 ఆమె కజనిస్థాన్ లోని బైకొనూర్ ఉపగ్రహ ప్రయో కేంద్రం (కాస్మోడ్రోమ్) నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరుతారని నాసా వెల్లడించింది.సాహసయాత్రకు సునీతా కమాండర్‌గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా.. వ్యోమగాములు రెండుసార్లు అంతరిక్షంలో నడుస్తారని, జపాన్, రష్యా, అమెరికాకు చెందిన నూతన వాహనాల ద్వారా పరిశోధన వేగవంతం అవుతుందని నాసా వివరించింది. లండన్ ఒలింపిక్స్ ప్రారంభం సందర్భంగా అంతరిక్ష కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఓ క్రీడా కార్యక్రమం చేపట్టనున్నట్లు సునీతా విలియమ్స్ తెలిపారు.