సుప్రీం కోర్టుకు బెదిరింపు మెయిల్‌ కోర్టు…న్యాయమూర్తులకు పటిష్ట భద్రత

nsqwkqpnన్యూఢిల్లీ, ఆగస్టు 18 : భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు పేల్చివేస్తామంటూ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే న్యాయమూర్తులకు అదనపు భద్రతను కల్పించారు. ఇటీవల కాలంలో తరచూ ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి.
1993 ముంబై పేలుళ్ల నిందితుడు యాకుబ్‌ మెమన్‌ ఉరిశిక్షను నిలుపుదల చేయలేదని ఓ న్యాయమూర్తికి బెదరింపు లేఖ వచ్చింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఇంటిపై నుంచి కొందరు దుండగులు లేఖను విసిరేసి వెళ్లారు. ఆ తరువాత యాకుబ్‌మెమ్‌కు ఉరిశిక్షను అమలు చేసిన నలుగురు న్యాయమూర్తులకు అదనపు భద్రతలను కల్పించారు.