సుభిక్షమైన పాలన అందించాం
` మళ్లీ మమ్మల్నే గెలిపించండి
` రైతుబంధు ఇచ్చే బీఆర్‌ఎస్ కావాలా? వద్దనే కాంగ్రెస్ కావాలా?
` బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా
` ఆ పార్టీ అధికారంలోకొస్తే చేతికి చిప్పే..
` తెలంగాణ కోసం తెగేదాక కొట్లాడినోడు ఎవడు ?
` ‘ధరణిని తీసేస్తే రైతుల భూములు గోల్‌మాల్..
` ఏ కాంగ్రెస్ సీఎం,పీఎం చేయని అభివృద్ధి మేం చేసినం
` హస్తంపార్టీ వచ్చేది లేదు సచ్చేది లేదు.. ఆలోచించి ఓటు వేయండి
` ఆంధ్రోళ్ల కంటే ఎక్కువగా తెలంగాణను ముంచింది కాంగ్రెస్ దద్దమ్మలే..
` కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు
` ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్
జగిత్యాల,ఖానాపూర్,వేములవాడ,దౌ
‘తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదారా సన్నాసి ? గట్ల ఎట్ల మాట్లాడుతవ్ అని తిరగబడ్డరా? మరి తెలంగాణ కోసం పేగులు తెగే దాక కొట్లాడినోడు ఎవడు ? తెలంగాణ తెచ్చినోడు ఎవడు ? 24గంటల కరెంటును తెచ్చినోడు ఎవడు ? ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్లిచ్చినోడు ఎవడు ? మరి ఇవాళ జగిత్యాలను జిల్లా చేసినోడు ఎవడు ? ఎన్కటికి ఎవడో అన్నడట విూరు మొత్తం వంటలు చేసి తయారుపెట్టుండ్రి.. నేను తర్వాత వచ్చి వడ్డన చేస్తాన్నడట? అట్లున్నది కాంగ్రెస్ పద్ధతి చూస్తే. ఇప్పుడచ్చి మా అంత సిపాయి లేరు.. మేం ఆక్ సిపాయిలం అంటున్నరు. ఎవరు నిజమైన సిపాయిలో ప్రజలు గుర్తించాలి. దయచేసి ఆలోచించకుండా గుడ్డిగా ఓటు వేయొద్దు. ఎప్పుడూ ఓట్లు కులం, మతంవిూద వేయొద్దు. కులాలు, మతలాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజల ప్రయోజనాల కేంద్రబిందువుగా ఓట్లు పడాలి. అది ఆరోగ్యవంతమైన రాజకీయం. సమాజంలో ఎవరూ తక్కువ కాదు. అందరూ సమానమే. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు’ అంటూ గుర్తు చేశారు.
రైతుల భూములు గోల్‌మాల్..
‘ధరణిని తీసివేసి మళ్లీ వీఆర్వోలు పెడుతరట. మళ్లీ 24కాలమ్స్ పెడుతరట. కౌలుదారుచట్టం పెడుతరట. కౌలుదార్ కాస్తు చేస్తే రైతుకు డబ్బులు ఇవ్వరట. కౌలుదారుకే ఇస్తరట. అట్ల రెండుసంవత్సరాలు ఆయన ఉన్నడనుకో మూడో సంవత్సరం నీ భూమి గోల్‌మాల్. రైతులు ఇగ చిప్పపట్టుకొని తిరగాలే అంతేకదా? మళ్లీ కోర్టులు.. కేసులు.. వకీళ్లు.. తాకట్లు.. పంచాయితీలు.. రైతుసోదరులారా జాగ్రత్త. నేను రైతుబిడ్డను కాబట్టి. నేను స్వయంగా చేస్తాను కాబట్టి.. రైతుల భూములు సేఫ్‌గా ఉండాలని చట్టం తీసుకువచ్చాను. చట్టం పారదర్శకంగా ఉంది. ఎవడి భూమిని ఎవ్వడూం ఏం పీకలేడు. ఇవాళ తెలంగాణలో భూముల విలువ ఎంత పెరిగింది? ధరణి వల్లే ఈ ధర పెరిగింది. బాజాప్తా ఇవాళ భూముల ధరలు పెరిగిన దానికి ధరణి లేకపోతే.. ఎన్ని పంచాయితీలు అయితుండే..? ఎన్ని తలకాయలు పగిలిపోతుండే..? ఎన్ని కేసులు అవుతుండే? ఒకసారి ఆలోచన చేయండి. ఇది గంభీరమైన సమస్య. తెలంగాణ రైతాంగానికి జీవన్మరణ సమస్య’ అన్నారు.‘ఇవాళ కరెంటు బాధ లేదు. భూముల రికార్డుల ధర బాధ లేదు. మళ్లీ రేపు రైతుబంధు రావాలి.. ఆఫీసుల చుట్టూ తిరగాలి.. పహనీ నకళ్లు తేపో.. అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్ తేపో అంటరు. ఆఫీసుల పొంట పోవాలి.. పోతే నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది అంటడు. రైతుబంధు ఎంతొస్తది అంటడు. రూ.80వేలు వస్తదంటే రూ.30వేలు ఇవ్వకుంటే సంతకం పెట్ట అంటడు. మళ్లీ మొదటికచ్చినట్టేనా? కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లవుతుంది. పాత కాంగ్రెస్ పాలన ఎట్లుండే? మళ్లీ అదే మొదలవుతుంది. మళ్లీ ఒకగలభూమి ఒకరికి రాసి.. జుట్లు ముడేసి.. ఆఫీసుల చుట్టూ తిరిగి.. చెప్పులగరాలి. ఇవాళ రిజిస్ట్రేషన్ ఎంత మంచిగైతున్నది. పావుగంటలో ఎవరి మండల కేంద్రంలో వాళ్లకు అవుతున్నది.పావుగంటలో మ్యుటేషన్ అవుతుంది. పట్టా అవుతుంది. పాస్ బుక్కులోకి ఎక్కుతుంది.. అప్పుడే ఆన్‌లైన్‌లోకి వస్తుంది. మునుపు ఆరు నెలలు.. ఏడాది.. రెండేళ్ల పడుతుండే. ముట్టజెప్పేది ముట్టజెప్పినా కూడా రెండేళ్ల వరకు కాకపోతుదుంటే. కొందరు పదేళ్లయినా చేయించుకోలేదు అమాయకులు. ఒకటే భూమి డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుండే. ఇవాళ అవుతుందా? కాదు కదా? అవన్నీ మోసాల నుంచి విముక్తే ధరణి. రైతులు క్షేమంగా ఉన్నరు. మళ్లీ రైతుల నోట్లో మన్నం వోస్తం.. దళారులే మా సుట్టాలు.. పైరవీకారులే సుట్టాలు.. లంచగొండి అధికారులే మా సుట్టాలు కాంగ్రెస్ బాజాప్తా అంటున్నది. మేం ఖుల్లం కుల్లాగా చెప్పినంకు కూడా మా ఓటు వేశారు అంటారు’ అని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఆంధ్రావాళ్లకంటే ఎక్కువగా.. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలే‘2004లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా ధోఖా చేసింది. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణరావు అని ఉండేది. ఆయన మాతో విూరు గెలిచారా? విూతోని మేం గెలిచినమా? దమ్ముంటే రుజువు చేయ్ కేసీఆర్ అని సవాల్ విసిరిండు. నేను రాజీనామా చేసి ఆయన మొఖంవిూద కొట్టిన. దమ్ముంటే రా నువ్వు.. విూ సంగతి మా సంగతి తేలుతదా అని మొఖాన కొట్టిన. నేను ఎంపీగా మళ్లీ పోటీ చేశాను. సమైక్యవాదుల తరఫున జీవన్‌రెడ్డి నాపై పోటీ చేసిండు. విూరందరూ సాక్ష్యులే. ఆ నాడు 2.50లక్షల మెజారిటీతో గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులేపారు. ఆ పోరాటం విూ కండ్ల ముందే జరిగింది’ అన్నారు.‘ఎప్పుడూ చరిత్రను చూడండి. తెలంగాణను ముంచింది ఆంధ్రావాళ్లకంటే ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్ పార్టే ముంచింది. తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మలే 58 ఏళ్ల దుఃఖానికి ప్రధాన కారణం. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. తెలంగాణ కాంగ్రెస్ గట్టిగా నిలబడి ఉంటే.. ఈ గతి మనకు ఎందుకు అవుతుండే ? ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే ? విూ దగ్గరనే ఓ మంచి ఉదాహరణ. వరద కాలువలో బురద లేకుండే కాంగ్రెస్ రాజ్యంలో. ఏమన్నా కొన్ని నీళ్లు వానకు పడితే రైతులు నాలుగు మోటర్లు పెట్టుకుంటే ఆ మోటర్లు ఎత్తుకుపోయి పోలీస్‌స్టేషన్‌లో పెట్టేది. నాలుగు తూములు పెట్టి చెరువులు నింపే పరిస్థితి లేకుండే. నేను ఉద్యమంలో కోరుట్లకుపోయినా, చొప్పదండికి పోయినా, జగిత్యాలకు వచ్చినా ఆ నాడు రైతులకు నాకు రైతులు ఇదే చెప్పేది’ అంటూ గుర్తు చేసుకున్నారు.‘కాంగ్రెస్ పాలన ఇంత దండిగా ఉండేది. రైతులు మోటర్లు పెట్టుకుంటే వాటిని కోసి కాలువలో వేసేది.. లేకపోతే తెచ్చి పోలీస్‌స్టేషన్‌లో పెట్టేది. అంత గొప్ప దండి కాంగ్రెస్ పాలన. ఆ పాలనను అందరూ యాది చేసుకోవాలి అందరూ. అంటే వాళ్లకు వీళ్లే వంతకొట్టుడు. ఆ రోజు ఉద్యమ స్పీచ్‌లలో నేను చెప్పేది.. కత్తి ఆంధ్రోనిదే కానీ.. పొడిచేటోడు మన తెలంగాణోడేనని. తెలంగాణను ముంచింది మొత్తం నోరుమెదపని కాంగ్రెస్ నేతల చేతగాని తనమే ఆరు దశాబ్దాలు తెలంగాణ ప్రజలను చాలా బాధపెట్టింది. ఈ విషయాలపై ప్రజలు ఆలోచించాలి. ప్రజాస్వామ్య పరిణితి అంటే అదే. పార్టీల చరిత్రను ఆలోచించాలి. ఏ పార్టీ వైఖరి ఏంటీ? నియ్యతి ఏందీ? ఏం చేస్తరని ఆలోచించాలి. అవకాశ వాదం తప్పా ఆరాటపడి ఎన్నడూ తెలంగాణ కోసం కాంగ్రెస్ పోరాడలేదు’ అన్నారు.
జాన్సన్ కు ఓటు వేస్తే నాకు వేసినట్టే లెక్క
ఖానాపూర్: అధికార బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు ఓటు వేస్తే నాకు వేసినంత లెక్క అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రaాన్సన్ నాయక్ లాభాలు గడిరచేందుకు నియోజకవర్గానికి రాలేదని, ప్రజాసేవ చేసేందుకే వచ్చాడని గతంలో ఉన్న ఎమ్మెల్యే పిచ్చిపిచ్చి వ్యవహారాల వల్లే జాన్సన్ ను ఇక్కడ పోటీ చేయించవలసి వచ్చిందని అన్నారు. జాన్సన్ స్వతహాగా రాజకీయాల్లోకి రాలేడని నేను రమ్మని ఆహ్వానిస్తేనే వచ్చాడని కేసీఆర్ స్వయంగా చెప్పారు. కెసిఆర్ కు జాన్సన్ నాయక్ సుపరిచితుడేనని నా కుమారుని క్లాస్మేట్ అని సభాముఖంగా ప్రజలందరికీ పరిచయం చేశారు. పింఛన్లు రావాలంటే, 24 గంటల కరెంటు కావాలంటే జాన్సన్ నాయక్ కు ఓటు వేయాలని, నియోజకవర్గ సమస్యలన్నీ చిటికెలో తీర్చేస్తామని కేసీఆర్ అన్నారు. స్థానికంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ రaాన్సన్ నాయక్ సభ ముఖంగా వివరించడంతో పరిశీలించిన కేసీఆర్ వీటన్నింటి సత్వర పరిష్కారం కావాలంటే జాన్సన్ నాయక్ కు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ధరణి తొలగించి రైతులకు కష్టాలు తెచ్చిపెడుతామన్న కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు చచ్చేది లేదని ఈ సందర్భంగా కెసిఆర్ అన్నారు. సదర్మాట్ లింకు కాలువకు ఏనాడో క్లియరెన్స్ వచ్చిందని పనులు కూడా పూర్తి చేసేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడి సమస్యలన్నీ చిటికలో తీర్చేస్తామని చెప్పారు. కేటీఆర్ దత్తత తీసుకున్న ఈ నియోజకవర్గం నేను సైతం దత్తత తీసుకున్నట్లేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలించిన 50 సంవత్సరాల దరిద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల్లో పోగొట్టిందని ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఖానాపూర్ లో గెలిచిన అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందని పవర్ ఉంటేనే పనిచేయగలుగుతామని, విూరు పవరిస్తే నేను అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు. ప్రజలంతా గ్రామాల్లోకి వెళ్లి తాను చెప్పిన మాటలు ఆలోచించాలని మరీ మరీ చెప్పారు. జాన్సన్ నాయక్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే వచ్చాడని ప్రజలు ఓటు వేసి ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పదేపదే ప్రజలకు జాన్సన్ నాయక్ ను సూచిస్తూ కేసీఆర్ ఆకట్టుకునే విధంగా మాట్లాడారు. కేసీఆర్ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సి దండే విట్టల్, మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, రాష్ట్ర మంత్రి ఐక్య రెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి లతో పాటు బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడ పైడిపల్లి రవీందర్ రావు, స్థానిక మునిసిపల్ చైర్మన్ అంకం రాజేందర్, అదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, జెడ్పిటిసిలు చారులత, జాను భాయి లతోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జీవితంలో ప్రధాన ఘట్టమైన నా పెండ్లి వేములవాడలోనే జరిగింది
వేములవాడ:డెబ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర భారతావనిలో రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని, ఆ పరిణతి వచ్చిన సమాజాలు, దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, కాబట్టి మన దేశంలో కూడా ఆ పరిణతి రావాలని తాను కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్ చెప్పారు. మన దగ్గర ఎన్నికలు రాగానే ఆగమాగమైతరని, అట్ల ఆగం కాకుండా, చెప్పుడు మాటలు నమ్మకుండా సొంతంగా ఆలోచించి ఓటేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వేములవాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు.‘ఎన్నికలప్పుడు పోటీలో నిలిచిన అభ్యర్థుల గురించి, ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల గురించి విూరు విూ గ్రామాల్లో బాగా చర్చించి ఓటేయాలె. అప్పుడే రాయేదో.. రత్నమేదో తేల్తది. అట్ల కాకుండా ఆగమాగం ఓటేస్తే మన తలరాత తలకిందులైతది. విూ ఓటు వేములవాడ నియోజకవర్గ ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తది. వేములవాడ పట్టణానికి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ గడ్డకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే జీవితంలో ప్రధాన ఘట్టమైన నా పెండ్లి ఇదే ఆలయంలో జరిగింది. అందుకే వేములవాడతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వాస్తవానికి ఇక్కడ నిజాయితీ పరుడైన చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యేగా ఉండె. ఆయనను మార్చాల్సిన అవసరం లేకుండె. కానీ కోర్టులో దిక్కుమాలిన కేసుతో తేపతేపకు గడబిడ గడబిడగా ఉంటుంది. మళ్లా పరేషాన్ ఎందుకని, ఆయనను అంతకన్నా ఉన్నత పదవిలో పెట్టుకుందామని చల్మెడ లక్ష్మినరసింహారావుగారిని ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిలబెట్టినం’ అని సీఎం చెప్పారు.‘బీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. 15 ఏండ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నం. కాంగ్రెస్ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది. దాంతో 58 ఏండ్లు మనం పడరాని పాట్లు పడ్డం. ఆఖరికి జగమొండిగా ఉండి 33 పార్టీల మద్దతు సాధించి, ఆమరణ దీక్షకు కూసుంటే, సమ్మెలు చేస్తే దిగొచ్చి రాష్ట్రం ఇచ్చిండ్రు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లుగా బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నది. అంతకుముందు 50 ఏండ్లు కాంగ్రెస్ ఉన్నది. గతంలో ఎవరు ఏం చేసిండ్రో, ఏ పార్టీ సర్కారు ఏం చేసిందో ఆలోచించి ఓటేస్తెనే మంచి జరుగుతది. తెలంగాణ వచ్చిన్నాడు చెట్టుకొగలం, గుట్టకొగలం ఉన్నం. తర్వాత ఏం జేస్తే తెలంగాణ సమాజం బాగుపడతదని బాగా ఆలోచించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినం. కాంగ్రెస్ పార్టీ రూ.200 ఇస్తున్న పెన్షన్‌ను రూ.1000 చేసినం. తర్వాత దాన్ని రూ.2 వేలు చేసుకున్నం. ఈసారి గెలిచినంక రూ.5 వేలు చేస్తనని నేను మనవి చేస్తున్నం. ఆడబిడ్డ పెండ్లి కోసం రూ.లక్ష ఇస్తున్నం. ఆడబిడ్డల ప్రసవానికి సర్కారు దవాఖానకు వెళ్తే ఇదివరకు నానా బాధలు ఉండె. ఇప్పుడు ఆ బాధలు పోయినయ్. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. మాతా మరణాలు, శిశు మరణాలు తగ్గినయ్’ అన్నారు.
సేవ చేయాలని చూస్తే చంపాలని చూస్తారా..?
దౌల్తాబాద్: పోయిన ఉప ఎన్నికల్లో నేను ఇక్కడికి రాలే..వొస్తే వొడిచే పోవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.. దుబ్బాకలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు….తెలంగాణ కోసమే బీఆర్‌ఎస్ పుట్టిందని..చావుకు వేరువకుండా, పేగులు తెగే దాకా పోరాటం చేశామన్నారు….తెలంగాణ ను ఉడగొట్టిందే కాంగ్రెస్,అని, హైదరాబాద్ ను ఆంద్రప్రదేశ్ లో విలీనం చేశారన్నారు….2014 ముందు మన కష్టాలు ఎలా ఉన్నాయో తెలుసు..కరువు కాటకాలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలస బతుకులు, రైతన్నల హరి గోసలు.. చూశాం..1969 లో ఉద్యమం చేస్తే 400 మందిని పొట్టన పెట్టుకున్నారు…2004 లో తెలంగాణ ఇస్తా అంటే..కాంగ్రెస్ తో పొత్తు పెట్టికొని అధికారంలోకి వొచ్చి.. మోసం చేసింది….తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వొచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తే..తెలంగాణ ప్రకటించారు.. మళ్లా మోసం చేశారు. మళ్లా పెద్ద ఉద్యమం చేస్తేనే , జాతీయ స్థాయిలో..పోరాటం చేస్తేనే..తెలంగాణ ఇచ్చారు..కష్టాల తెలంగాణ ను దారి లోకి తేవడానికి..జీవి ఆర్ రెడ్డి ని తీసుకొని అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రణాళికలు రచించడం జరిగిందన్నారు..200 పించిన్ తో ఎం పాయిదా….పించిన్ అంటే రెండు పూటల తినేలా చూడాలని 1000 చేసుకొని, మళ్లా 2000 చేసుకున్నామన్నారు..రేపు..5000 చేసుకుందామన్నారు…అమ్మాయి పెళ్లి కోసం లక్ష ఇస్తున్నాం.., అమ్మఒడి వాహనం, ద్వారా ఆసుపత్రికి తీసుకెళ్లి, ఉచిత ప్రసవం, కేసీఆర్ కిట్ అందిస్తున్నాం…రైతులు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి.దుబ్బాకలో .600 పీట్లు వేస్తేనే నీళ్లు పడుతాయు. పొసే బోరు ఎప్పుడు ఆగిపోయేదో తెలియదు ..కొబ్బరికాయ, తంగేడు కట్టే పట్టుకొని బోరు పాయింట్లు చూసేవారు…నీటి తీరువా రద్దు, రైతు బంధు కూడా, రైతు బీమా కూడా తెచ్చినాము..7515 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాము..55 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిందేవిూ లేదని, నేడు డోఖా మాటలు మాట్లాడుతున్నారన్నారు.., ఉత్తమ్ కుమార్ రైతుబంధు దుబారా అంటారు. దుబారా కాదు నాయనా…16 వేలు చేసుకుందాం..రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు సరిపోతుంది అంటారు.. సరిపోతుందా..అని ఆయన ప్రశ్నించారు.. తెలంగాణ రైతులకు 24 గంటల కరెంటు కావాలి.ఇస్తున్నాం…. ..రైతుల భూముల బాధ నాకు తెలుసు..3 ఏళ్లు కష్టపడి ధరణి తెచ్చాం..గతంలో భూమి ఎప్పుడు మారేది తెలియదు.. ..నేడు విూ బొటన వ్రేలు లేకుండా భూమి మార్చే అధికారం ముఖ్యమంత్రి కి కూడా లేదు..రాహుల్ గాంధీ ధరణి ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేస్తా అంటారు..భూమత అంటారు..భూమత కాదు..భూమేత కావొచ్చు అన్నారు..ధరణి పోతే.ఆగం కామా..అని ప్రశ్నించారు..నేడు రైతు బంధు ఇస్తున్నాము..అదుకుంటున్నాము..