సుల్తాన్ పుర యూత్ మైనారిటీ నాయకులు
షాదీఖానా స్థలం వద్ద చెవిలో పువ్వు పెట్టుకొని వినూత్న నిరసన
*సుల్తాన్ పుర యూత్ మైనార్టీ నాయకులు*
ఎన్నో ఏళ్లుగా ముస్లిం మైనార్టీలు ఎదురు చూస్తున్న షాదిఖానా నిర్మాణం కల గానే మిగిలిపోయిందని, ముస్లిం మైనార్టీ ప్రజలను మోసం చేయడం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మానుకోవాలని మెట్ పల్లి పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు, విమర్శించారు. సోమవారం పట్టణంలోని బీడీ కాలనీలో గల షాదీఖానా నిర్మాణ స్థలాన్ని సందర్శించి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చెవిలో పువ్వు పెట్టుకొని అక్కడ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా మెట్ పల్లి ముస్లిం మైనార్టీ నాయకులు, మాట్లాడుతు పట్టణ ముస్లిం మైనారిటీల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలోని బీడీ కాలనీలో 2005లో అప్పటి మెట్ పల్లి ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సహకారంతో 20 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. ఇప్పటికీ రెండు దశాబ్దాలు గడుస్తున్నా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదన్నారు. ఈ విషయంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టగా స్పందించిన ప్రభుత్వం 2021లో తొలిసారిగా భూమిపూజ చేసి పనులను ప్రారంభించారని అన్నారు. ఆ తర్వాత సంవత్సరకాలం కాలయాపన చేసి 2022 ఏప్రిల్ 1న మరోమారు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు భూమి పూజ చేశారు . అయితే నేటి వరకు పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. కేవలం ప్రహరి గోడ కట్టి మధ్యలోనే వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు అని ఆరోపించారు. ప్రభుత్వం సుమారు రూ 60 లక్షలు మంజూరు చేసినప్పటికీ నిర్మాణ పనులను ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. జూన్ మాసంలో షాది ఖానా డిజైనింగ్ కొరకు మూడు నెలల టైం కావాలని అన్నారు మరి ఇప్పటికీ వరకు మూడు నెలలు కాలేదా ఈ నిర్లక్ష్యం అంతా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కే దక్కుతుందని అన్నారు. కేవలం ఏప్రిల్ మాసాల్లో భూమి పూజ చేసి వాటిని మధ్యలోనే వదిలేసి ముస్లిం మైనారిటీలను ఫూల్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నిర్మాణ పనులు ప్రారంభించక పోతే పట్టణ ముస్లిం మైనార్టీలతో కలిసి విస్తృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైన పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు సైతం పూనుకుంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ పుర మైనారిటీ యూత్ నాయకులు పాల్గొన్నారు