సూటు-బూటు సర్కారుకు ఏడాది : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ,మే26(జనంసాక్షి): ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు విసిరారు. మోదీ ఏడాది పాలన నేపథ్యంలో ‘సూట్ బూట్ కీ సర్కార్‌కు శుభ్ కామ్నాయె అంటే సూటు బూటు సర్కారుకు శుభాభాకాంక్షలు అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం ధనికులకు కొమ్ముకాస్తోందని, సూట్ బూట్ కీ సర్కార్ అని రాహుల్ పార్లమెంట్ సమావేశలాల్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. మోదీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాహుల్ మరోసారి విమర్శలు
ఎక్కుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. రైతులు, కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రాధాన్యమిస్తుందని రాహుల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఓబామా పర్యటన సందర్భంగా మోదీ ధరించిన సూటు ఖరీదు 10 లక్షలని అప్పట్లో దానిపై పెను దుమారమే రేగింది. చివరకు విమర్సలనుంచి తప్పించుకునేందుకు ఆ సూటును వేలం వేసి విమర్శలనుంచి బయటపడే ప్రయత్నం చేశారు ప్రదాని. అయినా ఆ విమర్శలు మాత్రం ఇంకా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.