సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం

32 మంది మృతి
ఖార్టోమ్‌:
సూడాన్‌ దక్షిణ ప్రాంతంలో ప్రభుత్వ ప్రతినిధులతో వెళుతున్న విమానం కూలి పోవడంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో మంత్రి ఘాజీ అల్‌ సదీఖ్‌తో పాటు మొత్తం 32 మంది చనిపోయినట్లు సూడాన్‌ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దక్షిణ కోర్దోఫ్యాన్‌ రాష్ట్రంలో జరు గనున్న ఈద్‌ సంబరాల్లో పాల్గొనడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. వాతావరణం సరిగ్గా లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.