సూపరింటెండెంట్ ఆకస్మిక మృతి
తర్లుపాడు , జూలై 28 : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఎస్పి పాండురంగవిఠల్ (54) శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. ఇతని మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇతను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సెలవులో ఉన్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఇతని స్వగ్రామం మార్టూరు మండలం వలపర్లకు మృతదేహాన్ని తరలించారు. విఠల్ మృతదేహానికి మాజీ ఎంపిపి గాయం శ్రీనివాసరెడ్డి, ఎంపిడివో టి రామయ్య, ఇవోఆర్డి టి వీరభద్రాచారి, మాజీ సర్పంచి ఎస్ రామసుబ్బారెడ్డి, మాజీ ఎంపిటిసి కాళంగి రాజకుమారి, పంచాయితీ సెక్రటరీలు, విఆర్ఓలు ఘనంగా నివాళులు అర్పించారు.