సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సింధు
చైనా ఓపెన్‌లో భారత ఏస్ షట్లర్, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకుంది. ఈరోజు ఫుజౌలో జరిగిన ఫైనల్‌లో ఎనిమిదో సీడ్ సన్ యు (చైనా)పై 21-11, 17-21, 21-11తేడాతో సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటి గేమ్‌ను సులభంగానే నెగ్గిన సింధు, రెండో గేమ్‌లో పోరాడి ఓడింది. ఇక మూడో గేమ్‌లో ప్రత్యర్థిపై బలమైన షాట్లతో విరుచుకుపడి గేమ్‌తో పాటు మ్యాచ్‌లో కూడా విజయం సాధించింది. ఈ విజయంతో కెరీర్‌లో తొలి సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గాలన్న సింధు ఆశ నెరవేరింది.