సూరారంలో ఇద్దరు బాలికల అదృశ్యం
హైదరాబాద్, జనంసాక్షి: బాలకల అదృశ్యం వార్తలతో అమ్మాయిల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. తాజాగా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమవడంతో మరోసారి నగరంలో ఉధ్రిక్తత ఏర్పడింది.
శుక్రవారం రాత్రి బయటకు వెళ్లిన అనూష(10), అంబిక(14) అనే ఇద్దరు బాలికలు ఇళ్లు చేరకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం వరకు కూడా వారు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.