సెక్షన్ 8పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు
: కిషన్‌రెడ్డి
హైదరాబాద్,జూన్23(జనంసాక్షి): ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-8 అమలుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సెక్షన్-8 అమలుపై వస్తోన్న వార్తలు నిరాధారమైనవని తెలిపారు. కొందరు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో జరుగుతోన్న చర్చను పక్కదారి పట్టించేందుకే కొంతమంది సెక్షన్-8ను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.