సెగ పుట్టిస్తున్న రాజకీయ పరిణామాలు
ఉభయ తెలుగురాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. గమ్మత్తు రాజకీయాలు ఇప్పుడే చూస్తున్నాం.అధికారంలో ఉన్న వారిది ఒక ఎత్తయితే..లేని వారిది మరో ఎత్తుగా ఉంది. తెలంగాణాలో ఇద్దరు ఎమ్మెల్యేలను మొత్తం గానే సస్పెండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల వ్యవమారం తేలకుండానే అసెంబ్లీ రద్దయ్యింది. అంతకుముందు విపక్ష కాంగ్రెస్‌ను మొత్తంగా సభను నుంచి బహిష్కరించారు. అలా ఆ సమావేశాలు విపక్షం లేకుండానే ముగిసాయి. ఇకపోతే ఇప్పుడు 9నెలల ముందే అసెంబ్లీకి ముందస్తు ప్రకటించారు. ఈ విసయంలో అధికరాంలో ఉన్న వ్యక్తి సిఎంగా తీసుకునే నిర్ణయం కారణంగా ఎవరు కూడా ఆక్షేపించడానికి లేకుండా పోయింది. దీంతో ఇక ఎన్నికలు ఎప్పుడా అన్నది ఎదురు చూడాల్సి ఉంది. ఎన్నికల్లో తలపడడం కోసం ఇప్పుడ పరస్పర విమర్శలతో తెలంగాణలో రాజకీయవేడి సాగుతోంది. జగ్గారెడ్డి అరెస్ట్… రేవంత్‌రెడ్డికి పోలీసుల తాఖీదు..రాజాసింగ్‌కు పోలీసుల నోటీసులు..చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు వారెంట్లు ఇప్పుడు మరింత వేడి పుట్టిస్తున్నాయి. ఇలాంటివి మరెన్నో కాన రానున్నాయన డానికి ఇవి ఉదాహరణలుగా చూడాలి. ఎన్నికల ముందు ఇలాంటివన్నీ షరామామమూలే. ఇక ఈ దశలో ఎపిలో మరోరకమైన వ్యవహారం సాగుతోంది. అసెంబ్లీలో తన కర్తవ్యాన్ని, బాధ్యతను విస్మరించి ప్రజా ప్రయోజనాలకు తూట్లు పొడిచిన విపక్షంగా వైకాపా చరిత్రకెక్కనుంది. ఎలాంటి బలమైన కారణాలు లేకుండా అసెంబ్లీని వరుసగా బహిష్కరిస్తూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అసెంబ్లీలో మెజార్టీ సాధించే ప్రయత్నాల్లో ఉన్న ఏకైక పార్టీగా చరిత్ర కెక్కనుంది. గతంలో ఎప్పుడూ ఇలా అసెంబ్లీని బహిష్కరించి ప్రజా సమస్యలపై చర్చ చేయని పార్టీలు లేవు. విపక్షమంటే కేవలం ప్రభుత్వంపై విషం కక్కడం తప్ప మరోటి కాదన్న అభిప్రాయంలో ఉండడమే ఇందుకు కారణంగా చూడాలి. సమస్యలపై అధికరా పక్షాన్ని నిలదీస్తూ..దాని తప్పిదాలను ప్రజల ముందు ఎండగట్టేందుకు ఉన్న ఒకేఒక్క వేదిక అసెంబ్లీ. దానిని తిరస్కరించడం అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని చెప్పడం. అలాంటి పార్టీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ఎలా అసెంబ్లీలో మెజార్టీ ఇవ్వాలని అడుగుతుందన్నది ప్రశ్న. ఎపి అసెంబ్లీ స్వల్పకాలిక సమావేశాల్లో పాల్గొనకుండా ఓ రకంగా వైకాపా పెద్ద తప్పే చేస్తోంది. ప్రజా సమస్యల పట్ల కనీస బాధ్యత, చట్టసభల పట్ల గౌరవం లేని ప్రతిపక్షం అనిపించుకుంది. ప్రజాసమస్యలు చర్చించడానికివేదికైన అసెంబ్లీని బహిష్క రించడం అంటే పార్లమెంటరీ సాంప్రదాయాలను తుంగలో తొక్కడే తప్ప మరోటి కాదు. ప్రజా సమస్యలను చర్చించి అధికార పక్షాన్ని నిలదీసే అవకాశాలను కాలరాయడమే తప్ప మరోటి కాదు. అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ప్రజల్లోకి వెళ్లి అధికార పార్టీని, సిఎంను తిట్టడం వల్ల ప్రయోజనం ఏమిటన్నది గమనించాలి. తమపార్టీకి చెందిన 21మంది ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకున్నందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లుగా వైకాపా చెబుతోంది. పార్టీ మారిన వారిని వేటువేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే గతంలో వైఎస్ అధికరాంలో ఉండగా ఇలాంటి ఘటనలు ఉన్నాయి. తెలంగాణలో కూడా అనేకులు టిఆర్‌ఎస్ లో చేరారు. వారెవరిపైనా వేటు పడలేదు. ఇవన్నీ వ్యవస్థీకృత లోపాలుగా చూడాలి. దీనిపై చట్టసభలో గట్టిగా చర్చించి ఉండాలి. అయితే అసెంబ్లీకి హాజరు కాకపోవడం ద్వారా అలాంటి అవకాశాన్ని జగన్ కోల్పోయారు. సమస్యలు అసెంబ్లీలో చర్చించే సమయం కోసం అంతా చూస్తారు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టండని సవాల్ ఏస్తారు. తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడంపై జగన్ చూపుతున్న శ్రద్ధ సభలో ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించడంపై పెట్టడం లేదు. తమ సమస్యలు అసెంబ్లీలో చర్చించి పరిష్కరించారని ప్రజలు భావిస్తే మంచి ఆదరణ పొందే వారు. ప్రతిపక్షనేతగా జగన్ బాగా పనిచేశారని ప్రజలు నమ్మేవారు. ఇలాంటి నేత మనకు కావాలని కోరుకునే వారు. కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకున్న నేతగా జనగ్ రాజకీయంగా అప్రతిష్టపొందారు. ప్రత్యేక¬దా రాజకీయాల్లో పార్లమెంటు సభ్యత్వాలకు ఎంపీలతో రాజీనామా చేయించి, కేంద్రంపై పోరాడే అవకాశాన్ని వదిలేశారు. ఇప్పుడు అసెంబ్లీ కూడా అదే తరహా రాజకయీఆలు చేస్తున్నారు. తనతో పాటు ఎమ్మెల్యేల చేత అసెంబ్లీని బహిష్కరింప చేయడం ద్వారా ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని జగన్ కోరుకుంటున్నారన్నది ప్రజలకుకూడా అర్థం కావడం లేదు. ఎంపిల రాజీనామాలతో అటు పార్లమెంటుకు వెళ్ళలేని దుస్థితి ఏర్పడింది. అక్కడా తమ వాయిస్ విన్పించలేని పరిస్థితి తెచ్చుకున్నారు. ఇక్కడ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడలేని పరిస్థితి కావాలని అనుసరిస్తున్నారు. ఇటు వంటి పార్టీ, ప్రతిపక్షం ప్రజలకు అవసరమా? అని ప్రజలు ప్రశ్నించుకుంటే వైకాపా ఉనికికే ప్రమాదం రానుంది. జగన్ వైఖరిని వ్యతిరేకించి తమదారి తాము చూసుకొన్న ఎమ్మెల్యేలపై గగ్గోలు పెడుతున్న జగన్, తన తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా వుండగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి దెబ్బతీయాలని ప్రయత్నించిన సంగతిని గుర్తు చేసుకోవాలి. ప్రలోభాల వ్యహారాలపై కఠిన చట్టాలు ఉంటే తప్ప ఇవి మారవు. ఇవి మారనంత కాలం ఎమ్మెల్యేలు, ఎంపిలు దూకుతూనే ఉంటారు. వ్యవస్థీకృతమైన ఈ జాడ్యాన్ని నిర్మూలించాల్సిందే. ఇవన్నీ చట్టసభల్లో చర్చించి మార్చాలి. మొత్తంగా అటు తెలంగాణ,ఇటు ఎపిల్లో గమ్మత్తు రాజకీయాలు నడుస్తున్నాయి.