సెప్టెంబర్ మార్చ్‌కు ఉప్పెనలా తరలిరండి
కరీంనగర్ కవాతును విజయవంతం చేయండి
కరీంనగర్ టౌన్, ఆగస్టు 22(జనంసాక్షి):
సెప్టెంబర్ మార్చ్‌ను విజయవంతం చేయాలని జెఎసి కోదం డరాం అన్నారు. బుధవారం నగరంలోని ఫిల్మ్‌భవన్‌లో జరిగిన తెలంగాణ విద్యుత్ సంక్షభం- కారణాలు పరిష్కార మార్గాలు అం శంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా మాఈ జరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనే ధ్యేయంగా నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌ను విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మార్చ్‌కు ప్రజలను కార్యోన్ముఖులను చేసేందుకు సెప్టెంబర్16న నగరంలో నిర్వహించనున్న కరీంనగర్ కవాతును విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లను ఆంధ్రాకు తరలించి కుంటిసాకులు చెప్పి గ్యాస్ విద్యుత్ ప్లాంట్లను నిర్మాణం చేయకుండా తెలంగాణలో విద్యుత్ సమస్యకు కారణమవుతున్న సీమాంద్ర పాలకులు తెలంగాణ రైతులు, కార్మికులను రోడ్డున పడెస్తున్నారన్నారు. తెలంగాణకు వచ్చే గ్యాస్ వాటాను ఆంధ్రా ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్ట్‌లయిన ల్యాంకో ,వేమనలకు తరలించి ఇక్కడి గ్యాస్ ప్రాజెక్ట్‌లను నిర్వీర్యపరిచి విద్యుత్ సంక్షోభం సృష్టిస్తున్నారన్నారు. అందుకే మన తెలంగాణ మనగ్గావాలె అంటూ కొట్లాడుతామని అందులో భాగంగా నిర్వహించతల పెట్టిన మార్చ్‌కు ఉప్పెనలా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ విద్యుత్ జెఎసి నాయకుడు రఘు మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ ప్రాజెక్ట్‌లపై సీమాంద్ర సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.
తెలంగాణ ఏర్పాటు అయ్యాక తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్ట్‌లు లేకుండా చేసేందుకు కుట్రపన్నుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు ముక్కెర రాజు, లక్ష్మారెడ్డి, పిట్టల రవి, జిల్లా జెఎసి చైర్మన్ వెంకటమల్లయ్య, కన్వీనర్ రవీందర్, మహిళా జెఎసి చైర్మన్, నాయకులు , జెఎసి సభ్యులు, విద్యావంతుల వేదిక సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన నగరంలోని కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి తెలంగాణ మార్చ్‌కు కలిసి రావాలని వర్తక, వ్యాపార వర్గాలను కోరారు.