సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్ : కొదండరాం
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రోజు జరిగిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో నిక్వహించ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ను సెప్టెంబర్ 30న చేపట్టిన తెలంగాణ సత్తా చాటుతామని ఆయన అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రం తెలంగాణ పై తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం అన్ని పార్టీలు, వర్గాలను కలుపుకుని పోవాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ కోసం అందరం కలిసికట్టుగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు.