సెప్టెంబర్ 30న సీమాంధ్ర పాలనకు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం
కోదండరాంజనగామ, సెప్టెంబర్ 14 (జనంసాక్షి)ః ఈనెల 30న సీమాంధ్ర పాలనకు హుస్సెన్‌సాగర్ లో నిమజ్జనం చేద్దామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, ప్రొపెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ వచ్చేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శుక్రవారం జనగామలోని తెలంగాణ సామాజిక చైతన్య వేధిక ఆధ్వర్యంలో సిహెచ్.రాజమౌళి అధ్యక్షతన భారీసభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం సీమాంధ్ర పాలనపై నిప్పులు చెరిగారు. 50ఏళహ్లగా తెలంగాణకు అన్ని రంగాల్లో ఇచ్చిన హావిూపై ఎంపి రేణుకాచౌదరి స్పష్టం చేయాలని అన్నారు. తెలంగాణ ప్రజల స్వేచ్చకోసం ఉద్యమిస్తుంటే ఆంధ్రపాలకులు కుట్రలు చేస్తూ ఆధిపత్యాన్ని ప్రదరిశ్తున్నారని, స్వేచ్చకోసం ఉద్యమించే తెలంగాణ ఉద్యమం ముందు ఆంధ్ర పాలకుల కుట్రలు పటాపంచలు అవుతాయని అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేధిక అధ్యక్షులు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ రానున్న యువతరం
కోసమే తెలంగాణ ఉద్యమం అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆత్మగౌరవం ముందు ఏసదస్సులు గొప్పవి కాదని, పోలీసు బాలగాల ద్వారా ఉద్యమాన్ని అణచడం సాద్యం కాదని అన్నారు. తెలంగాణ మార-్చను ఆపడం ఎవరితరం కాదని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఒక్క ప్రజాస్వామ్య వాతావరణం తెచ్చిందని అన్నారు. ఎస్సీ,ఎస్టీల సబ్‌ప్లాన్ విషయంలో కేసిఆర్ చిత్తశుద్దితో వ్యవహరించారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అణచబడిన సామాజిక వర్గాల పాత్ర అధికంగా ఉందని అన్నారు. ఈసమావేశంలో తెలంగాణ సామాజిత చైతన్య వేధిక ఉపాధ్యాక్షులు, మాజీ ఎమ్మెల్యే సిహెచ్.రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం లింగారెడ్డి, కార్యదర్శి కోడం కుమార్, మోర్తాల ప్రభాకర్, జిల్లా జెఎసి అధ్యక్షులు ప్రొపెసర్ పాపిరెడ్డి, టిఎన్‌జిఓ రాష్ట్ర కార్యదర్శి కారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు రాజేష్‌కుమార్, సుబ్బారావు, కత్తి వెంకటస్వామి, కన్న పరశురాములు, సూర్యం, బెల్లయ్యనాయక్, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.