సెలక్షన్ సిండికేట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ.
17 సంవత్సరాలు గా వివిధ కార్యక్రమాలు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 3 జనం సాక్షి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంత బజార్ లో సెలక్షన్ సిండికేట్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విగ్నేశ్వరుడికి గత నాలుగు రోజుల నుండి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా నిత్యం పూజలతో హోమాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సెలక్షన్ సిండికేట్ సభ్యులు,వారి కుటుంబాలు అంతా కలిసి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో విఘ్నేశ్వరునికి అలంకరణ చేస్తున్నారు. ఆదిదేవుడైనటువంటి వినాయకుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు కళ్ళు మెరిమేట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలతో మండపాన్ని అలంకరించారు. గత 16 సంవత్సరాల నుండి సెలక్షన్ సిండికేట్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్టించడం జరిగింది. ఈ సంవత్సరం జిల్లా కేంద్రంలో ప్రత్యేక ఆకర్షణగా ఎలక్షన్ సిండికేట్ విగ్నేశ్వరుడు ప్రత్యేక ఆకర్షణతో నిలుస్తున్నాడు.
అన్నప్రసాద వితరణ:
గత 16 సంవత్సరాలుగా ఎలక్షన్ సిండికేట్ సభ్యులు నెలకొల్పుతున్నటువంటి వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.ఈ సంవత్సరం 17 వసంతంలో కి అడుగు పెట్టిన గణనాథుని మండపంలో శనివారం సెలక్షన్ సిండికేట్ సభ్యులంతా కలిసి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్య క్రమానికి భక్తులు వేల సంఖ్యలో వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సెలక్షన్ సిండికేట్ అధ్యక్షుడు మిడిదొడ్డి శరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి పూల శివప్రసాద్ కోశాధికారి కొండూరు సాయిరాం ముఖ్య సలహాదారుడు అల్లంపల్లి రమేష్ ఉపాధ్యక్షులు శేఖర్ శ్రీనివాసులు సురేందర్ ఆకుతోట రాజు నామా రాము కె.స్వామి సతీష్ బాబు మరియు సిండికేట్ సభ్యులు మలి పెద్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు.