సెలవుదినాల్లో కళాత్మక చలనచిత్రాలు
నిజామాబాద్,అక్టోబర్ 20: క్లాసిక్ సినిమా అండ్ సాంస్కృతిక సొసైటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 8.45 గంటల నుండి 10.45 వరకు రిహాల హిందీ సినిమా ప్రదర్శించనున్నట్లు సొసైటీ కార్యదర్శి మేక రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి, నేటి తరానికి సంబంధించిన కొత్త, పాత కళా సంగీత సాంస్కృతిక , సాహిత్య విలువలు సినిమాల వినోదం ద్వారా ప్రభావితం చేసినవి, ఈ సినిమా సాంస్కృతిక సొసైటీ ద్వారా ప్రతి నెల సెలవు దినాల్లో కళాత్మక చలనచిత్రాలు, ఇంగ్లీష్, హిందీ, ఇతర భాషలవి ప్రత్యేక ఆటల్లో ప్రదర్శిస్తున్నామన్నారు.