.సెలవుపై వీసీి అప్పారావు
– హెచ్‌సీయూలో మళ్లీ మొదలైన ఆమరణ దీక్షలు
హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన మరో మలుపు తిరిగింది. హెచ్ సీయూ వీసీ అప్పారావు సెలవులపై వెళ్లారు. అప్పారావు తాత్కాలిక సెలవులు తీసుకున్నారు. డా.విపిన్ శ్రీవాత్సవ్ కి వీసీ బాధ్యతలు అప్పగించారు. రేపటి నుంచి శ్రీవాత్సవ్ బాధ్యతలు తీసుకోనున్నారు. వీసీ సెలవులపై వెళ్లడాన్ని విద్యార్థులు త్రీవంగా తప్పుబడుతున్నారు. కేంద్రం, వీసీ రాజకీయ డ్రామా ఆడుతున్నారని మండిపడుతున్నారు. కుట్ర పూరితంగానే వీసీ సెలవులపై వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసును తప్పుదోవపట్టించడానికి ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
హెచ్‌సీయూలో మళ్లీ మొదలైన ఆమరణ దీక్షలు
మరోవైపు హెచ్ సీయూలో మళ్లీ విద్యార్థులు ఆమరణ దీక్షకు పూనుకున్నారు. కాంపస్‌లోని ఐదుగురు విద్యార్థులు ఆమరణ నీరాహార దీక్ష చేపట్టారు. విద్యార్థులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. రోహిత్ మృతికి ప్రధాన నిందితుడు వీసీ అప్పారావు అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వీసీ అప్పారావును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీసీ అప్పారావు రాజకీయంలో భాగంగానే సెలవులపై వెళ్లిపోయారని విమర్శించారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే అప్పారావు సెలవులపై వెళ్లారని మండిపడుతున్నారు. కేంద్రప్రభుత్వం వీసీ అప్పారావును తొలగించాలని? అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ డ్రామా ఆడుతున్నారని మండిపడుతున్నారు. రోహిత్ మృతికి కారకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, బండారు దత్తాత్రేయలను పదవుల నుంచి తొలగించాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డివమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ ఉద్యమం ఆగదని విద్యార్థులు హెచ్చరించారు. తమ నిరసన కొనసాగుతోందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రేపటి చలో హెచ్ సీయూ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని చెప్పారు.