సెల్ఫీ సూసైడ్ చేసుకున్న జంట

మెహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన సాయికుమార్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన కృష్ణ కుమరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిప్పాపురంలో కాపురం ఉంటున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాత కలహాలతో విడిపోయారు, తర్వాత మళ్లీ కలిసారు. అయితే తమను ఎవరూ అర్ధం చేసుకోవడంలేదని, దూరం చేసారంటూ చనిపోయేముందు వీడియోలో రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము చనిపోయిన తర్వాత తన పర్సులో ఉన్నట్టు చేయాలంటూ వీడియోలో చెప్పింది కృష్ణ కుమారి. అయితే చికిత్స తీసుకుని బయటపడ్డ భర్త సాయి హస్పటల్‌లొ కనిపించడంలేదు. దీంతో ప్లాన్ ప్రకారమే ఇలా చేశారంటూ కృష్ణ కుమారి బంధువులు ఆరోపిస్తున్నారు.