సెల్‌ఫోన్ కౌంటర్ రద్దు
ఖమ్మం, నవంబర్ 30 : భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం వద్ద గల సెలఫోన్ కౌంటర్ నిర్వహణను దేవాదాయ ధర్మాదాయ శాఖ రద్దు చేసింది. గతంలో బ్యాగులు, సెల్‌ఫోన్లు, కెమెరాలు ఆలయంలోకి తీసుకువెళ్లడం కుదిరేది కాదు. ప్రతి వస్తువుకు ఐదు రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పుడు క్యూలైన్ వద్ద ఉన్న ఈ కౌంటర్‌తో మిగత భక్తులు అవస్థలు పడేవారు. ఈ నేపథ్యంలో గుత్తేదారులు హక్కును రద్దు చేసి గుత్తేదారులకు ఇవ్వాల్సిన చెల్లింపులన్ని మొదలుపెట్టారు. ఈ కౌంటర్ వల్ల రామాలయానికి ఆదాయంతో పాటు రక్షణ ఉంటుందని కొందరి భావన. ఈ విషయాన్ని పరిగణంలోకి తీసుకొని గిరిజనులకు తిరిగి అప్పగించాలని ప్రచారాలు సాగుతున్నాయి. ఇదే జరిగితే సకుటుంబంతో వచ్చే వారు తమ ఫోన్లను, బ్యాగులకు, కెమెరాలకు డబ్బు సమర్పించుకోవాల్సిందే. ఆలయ రక్షణ కోసం సరైన చర్యలు చేపట్టాలంటే మెటల్ డిటెక్టర్లను బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.