సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ.. వ్యక్తి మృతి

వరంగల్ (కురివి): సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురివి మండలం సూదరపల్లి గ్రామ పరిధిలోని బోడబూకయతండాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తండాకు చెందిన బూక్యారాందాస్ (30)  ఉదయం సెల్‌ఫోన్ కు చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్కూటై షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.