సైదాపూర్‌లో ఘనంగా మహాశివరాత్రి

కరీంనగర్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి  ):  కరీంనగర్‌ జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల్లో భక్తులు పపూజలు చేశారు. ఉదయం నుంచే వివిధ ఆలయాల్లో శివనామ స్మరణతో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. సైదాపూర్‌ మండలంలోని గొడిశాల, ఆకునూరు, బొమ్మకల్‌, ఎక్లాస్‌పూర్‌ గ్రామాలలోని శివాలయాలకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయా ఆలయ కమిటీలు అన్నిరకాల వసతులు కల్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.