సైనాను ఘనంగా సత్కరించిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: భారత షట్లర్ సైనానెహ్వాల్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఇండోనేషియా టైటిల్ గెలుచుకున్న సందర్భంగా గచ్చిబౌలి గోపిచంద్ అకాడమీలో సైనాకు సన్మాన సభను ఏర్పాటు చేశారు.భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. వరుసగా పతకాలు సాధిస్తున్న సైనా గత ఏడాది కాలంగా ఆద్భుత ఆటతీరును ప్రదర్శిస్తోందని మంత్రి వట్టి వసంత్‌కుమార్ అభినందించారు. ఒలింపిక్స్‌లో మరింత మెరుగ్గా రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండోనేషియా ఓపెన్‌లో క్యార్టర్ ఫైనల్ మ్యాచ్ విజయం మరిచిపోలేనిదని తన అనుభూతులను పంచుకున్నారు.