సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశానికి బల్దియా సహకారం

– నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌

హైదరాబాద్‌, నవంబర్‌2(జ‌నంసాక్షి): నగరంలో 2018 జనవరిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగే ఆల్‌ ఇండియా సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశం నిర్వహణకు జీహెచ్‌ఎంసీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వాహక ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ అచ్యుత సమంతాతో పాటు ప్రతినిధి బృందం గురువారం మేయర్‌ రామ్మోహన్‌ను కలిసింది. ఈ సందర్భంగా సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశానికి దేశ విదేశాల నుంచి వేలాది మంది శాస్త్రవేత్తలు హాజరవుతున్నట్లు బృందం తెలిపింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ సమావేశానికి 20 మందికి పైగా నోబెల్‌ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు హాజరవనున్నట్లు బృందం మేయర్‌కు వెల్లడించింది. దీనికి సహాయకసహకారాలు అందించాలని బృందం సభ్యులు మేయర్‌ను కోరారు. దీంతో స్పందించిన మేయర్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశానికి జీహెచ్‌ఎంసీ సహకరిస్తుందని స్పష్టం చేశారు.