సైబరాబాద్ పోలీసులపై పనిభారం
హైదరాబాద్,ఆగస్ట్1(ఆర్‌ఎన్‌ఎ): సైబరాబాద్ పరిధిలో పోలీసులపై నిత్యం భారం పడుతోంది. వివిధ కేసులు, మాదకద్రవ్యాల కేసులు పరిష్కరించడంలో తీరికలేకుండా పోతోంది. ఇక్కడే ఐటి కారిడార్ ఉండడం, నిత్యం విఐపిలు, సినిమా వాళ్ళ తాకిడి ఎక్కువ ఉండడం తదితర కారణాల వల్ల వారిపై పని భారం పెరుగుతోంది. సైబరాబాద్ పరిధిలోని నైపుణ్యం కలిగిన కానిష్టేబుళ్ళను గుర్తించి ఇటీవల స్టేషన్ హౌస్ రైటర్లుగా శిక్షణనిచ్చారు. నైపుణ్యం కలిగిన స్టేషన్ రైటర్లతో పని భారాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. నెలవారీ నేరాల రివ్యూ, రోడ్డు ప్రమాదాల విశ్లేషణ, ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ నైపుణ్యాలు, సిసిటిఎన్‌ఎస్ కేస్ స్టడీ పైన శిక్షణనిచ్చారు. ఈ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రం తో పాటు రివార్డును సీపీ అందజేశారు. వీరు కేసులను పరిశీలించి కొలిక్కి తీసుకుని వస్తున్నారు. అయినా ఇంకా స్టాఫ్ కొరత ఉందని అంటున్నారు. ఇటీవల సైబర్ క్రేమ్‌తో పాటు వివిధ రకాల కేసుల కారణంగా ఒత్తిడి ఎదుర్కొటున్నారు.