సొంతూరుకు చేరిన వీర జవాను ముస్తాక్‌ పార్థీవ దేహం

4
హైదరాబాద్‌,ఫిబ్రవరి 15(జనంసాక్షి):సియాచిన్‌ మంచు తుపానులో అసువులు బాసిన వీర జవాను ముస్తాక్‌ అహ్మద్‌ పార్థీవ శరీరం సొంతూరుకు చేరుకుంది.    సోమవారం భౌతికకాయాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాలకు రోడ్డుమార్గంలో తరలించారు. అంతకుముందు దిల్లీ నుంచి సైనిక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ముస్తాక్‌ పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. అనంతరం సైనిక లాంఛనాలతో ఆర్మీ, పోలీసు అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక అంబులెన్స్‌లో సైనిక వాహనశ్రేణితో ముస్తాక్‌ అహ్మద్‌ భౌతికకాయాన్ని నంద్యాలకు తరలించారు.  సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడి మరణించిన జవాను ముస్తాక్‌ అహ్మద్‌ భౌతికకాయం బేగం విమానాశ్రయానికి చేరుకుంది. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకున్న అహ్మద్‌ భౌతికకాయానికి బేగంపేట విమానాశ్రయంలో ఆర్మీ, పోలీసు అధికారులు నివాళులర్పించారు. పలువురు రాజకీయ నాయకులు కూడా ముస్తాక్‌ అహ్మద్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. మంగళవారం స్వగ్రామం పార్నపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ సియాచిన్‌లో మంచు చరియలు విరగిపడి మరణించిన జవాను ముస్తాక్‌ అహ్మద్‌కు ఆంధప్రదేశ్‌ మంత్రివర్గం నివాళులర్పించింది. ముస్తాక్‌ అహ్మద్‌ కుటుంబానికి రూ.25లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. విజయవాడలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.