సొంత పార్టీలోనే కొనసాగుతాంపుప్పాల సరిత-దేవేందర్

ఖానాపురం సెప్టెంబర్ 20జనం సాక్షి

సొంత పార్టీలోనే కొనసాగుతానని అయోధ్య నగరం అయిదవ వార్డు సభ్యురాలు పుప్పాల సరిత-దేవేందర్అన్నారు.కొందరు వ్యక్తుల బలవంతంగా నిన్న అసంపూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన టి.ఆర్.ఎస్ వార్డు సభ్యురాలు పుప్పాల సరిత-దేవేందర్ మంగళవారం తిరిగి మళ్లీ టి.ఆర్.ఎస్ పార్టీలోకి రాగా,వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు ఎర్ర లింగారెడ్డి పార్టీలో చేరగా వరంగల్ జిల్లా ఒడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ ,ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు లు ఎంపీపీ నివాసంలో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా తిరిగి పార్టీలోకి విచ్చేసిన సరిత-దేవేందర్ మాట్లాడుతూ అయోద్యనగర్ లో కొందరు కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పినంతా మాత్రాన మేము ఆ పార్టీలో ఉండలేక పోయామని,అభివృద్ధి ప్రదాత పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటే టి.ఆర్.ఎస్ పార్టీలోనే కొనసాగుతామని తెలిపారు. ఈ చేరికల కార్యక్రమంలో అయోద్యనగర్ సర్పంచ్ జరుపుల అశోక్,ఉప సర్పంచ్ కూస లింగమూర్తి,వైస్ ఎంపీపీ రామసహయం ఉమ-ఉపేందర్ రెడ్డి,సొసైటీ డైరెక్టర్ గంగాధరి రమేష్, అశోక్ నగర్ గ్రామపార్టీ అధ్యక్షుడు ముచ్చ యాదగిరి రావు,నాయకులు గుడిపూడి నాగేశ్వరరావు,గొనె రాజు, తదితరులు పాల్గొన్నారు.