సొసైటీ చైర్మన్ ని  పరామర్శించిన ఎమ్మెల్యే డియస్ రెడ్యానాయక్

కురవి అక్టోబర్-18
(జనం సాక్షి న్యూస్)

మహబూబాబాద్ పట్టణ కేంద్రములో
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కురవి మండలం గుండ్రాతిమడుగు పిఎసిఎస్ చైర్మన్ గార్లపాటి వెంకట్ రెడ్డి ని పరామర్శించిన డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్.వారి ఆరోగ్య స్థితి గతులను తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఆయన వెంట భారాస జిల్లా  సీనియర్ నాయకులు బజ్జురి పిచ్చి రెడ్డి,కురవి ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి ,భారాస రాష్ట్ర యూత్ నాయకులు గూగులోత్ రవి నాయక్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాజునాయక్,బిఆర్ఎస్ నాయకులు డిఎస్ కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.