సోనియా, రాహుల్‌తో ఆందోళనకారుల చర్చలు
న్యూఢిల్లీ : అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న నిరసనకారులతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చర్చలు జరిపారు. ఆందోళనకారులతో హోం శాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ కూడా భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగింది. భేటీ అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆందోళనకారుల డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పారు. దోషులకు శిక్ష పడేలా చూస్తామని ఆందోళనకారులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆందోళనకారుల ప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.