సోనియా వల్లే తెలంగాణ: పొన్నాల

31wlgsrh__ponna_HY_2296652fహైదరాబాద్‌, జూన్‌ 2 (జ‌నంసాక్షి): బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తామని చెప్పిన సిఎం కెసిఆర్‌ తెలంగాణను తన ఎస్టేట్‌గా మార్చుకున్నారని  పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. త్యాగాల పునాదుల విూద తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి సోనియా గతంలో మాట ఇచ్చారని.. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రత్యేక రాష్టాన్న్రి ఇచ్చారని చెప్పారు. విభజనకు ముందుగా పార్టీ నేతలను ఒప్పించి ఏకతాటిపైకి తెచ్చారని,  ఆ తర్వాత దేశంంలోని వివిధ పార్టీలను ఒప్పించారని తెలిపారు. అలాంటి సోనియాకు స్థానం లేకుండా, ఆమెకు దగా చేసేలా కాంగ్రెస్‌ నార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి అన్ని రాజకీయ పక్షాలను ఏకతాటిపైకి తెచ్చారని గుర్తు చేసిన పొన్నాల.. సోనియా ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉంటారని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణం అని అనడాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్‌ హయాంలో అనేక అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా తీర్చిదిద్దేందుకు.. ఐటీ రంగంలో ప్రగతి సాధించేందుకు గాను ఐటీఐఆర్‌ను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని పొన్నాల ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయం విూద ఆధారపడ్డారని.. ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పొన్నాల కోరారు. అయితే బంగారు తెలంగాణ పేరుతో చేసే అక్రమాలను కాంగ్రెస్‌ ఎప్పటికీ అడ్డకుంటుందని అన్నారు.