స్కీంలు కావవి.. స్కాంలు
` ఇరిగేషన్ ప్రాజెక్టులపై మండిపడ్డ మోదీ
` ఇరిగేషన్ స్కీమ్‌లను స్కామ్‌లుగా మార్చిన కేసీఆర్
` తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోంది
` కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి
` ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత మాది
` 370 ఆర్టికల్, పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం
` మీ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం
` బీఆర్‌ఎస్ సర్కారు అవినీతిని తరిమి కొట్టాలి
` ఎన్నికల ప్రచారం సభల్లో మోదీ
మహేశ్వరం,కామారెడ్డి:(జనంసాక్షి): ఇరిగేషన్ స్కీమ్‌లను కేసీఆర్ ఇరిగేషన్ స్కామ్‌లు చేశారని పీఎం మోదీ దుయ్యబట్టారు. అలాగే తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం పెరుగుతోందని హర్షించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుక్కుగూడలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని.. ఇక్కడి ప్రజల్లో తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీఆర్‌ఎస్ అవినీతి వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రాలేదని ఆవేదన చెందారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుక్కుగూడలో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ లో మోదీ పాల్గొని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీలలో ప్రజలు తిప్పికొట్టారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు అని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే బీఆర్‌ఎస్‌కు వేయడమే అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని చెప్పారు. కానీ బీజేపీ అలాకాదు.. తెలంగాణలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమంటూ.. మహేశ్వరం ప్రజలకు తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు స్వార్థ పార్టీలని.. సమాజ విరోధులు అని పీఎం మోదీ ధ్వజమెత్తారు. మోదీని తిట్టడమంటే కేసీఆర్‌కు మహాఇష్టం.. ఇరిగేషన్ స్కీమ్‌లను కేసీఆర్ ఇరిగేషన్ స్కామ్‌లు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారని స్పష్టం చేశారు. మాదిగల వర్గీకరణకు కొత్తగా కమిటీని ఏర్పాటు చేశామని.. బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు లాభం చేకూరుతుందని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేకపోతోందని విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే పెట్రోల్, డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను తగ్గిస్తామని ప్రధాని మోదీ మాటిచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల కోట్లు జమ చేశామని హర్షించారు. రైతులకు రూ.300లకే యూరియా బస్తా ఇస్తున్నామని.. తెలంగాణ రైతుల కోసం బాయిల్డ్ రైస్ కొంటున్నామన్నారు. కాంగ్రెస్ గెలిస్తే బీఆర్‌ఎస్‌కు కార్బన్ సర్కార్‌లా పని చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే బీజేపీకు ఓటు వేయాలని.. మహేశ్వరం సభకు విచ్చేసిన సభికులను ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఘనత మాది
కామారెడ్డి: ఇచ్చిన హావిూలను అమలు చేసిచూపిన సత్తా బిజెపిదని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలోనూ బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి సభలో మాట్లాడుతూ కెసిఆర్ అవినీతిని అంª`తమొందించేందుకు ఇక్కడా ఓడిరచాలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ అవినీతికి చరమగీతం పాడాలన్నారు. వాగ్దానం ఇచ్చామంటే అమలు చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇచ్చిన హావిూలను నిలబెట్టుకున్నామని చెప్పారు. కామారెడ్డి నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం దక్కిందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య వంటి విషయాల్లో చిత్తశుద్దిని చాటుకున్నామని అన్నారు. గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్న హావిూని నిలబెట్టామన్నారు. నిజామబాద్‌కు పసుపుబోర్డు ఇచ్చామని గుర్తు చేశారు. మాదిగల సమస్యలు ప్రస్తావిస్తూ వారికి కూడా పరిష్కారం చూపుతామని అన్నారు. ఇకపోతే టీఆర్‌ఎస్ హఠాత్తుగా బీఆర్‌ఎస్‌గా మారిందని, యూపీఏ కాస్త ఇండియా కూటమిగా మారిపోయిందని విమర్శించారు. ఇక్కడ జన ప్రవాహం కనిపిస్తోందని, దీన్ని బట్టి ప్రజలు కెసిఆర్‌పై ఎంతగా వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చచేసుకోవ చ్చన్నారు. తొమ్మిదేళ్ల వారి పాలనపై ప్రజలు విసిగిపోయారు. ఇక్కడి ప్రజలు బీఆర్‌ఎస్ నుంచి విముక్తి కోరుతున్నారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా విధానాలు ఉన్నాయి. నేను ఇచ్చే మాటలే గ్యారంటీ. దేశానికి బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనే. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు డబ్బులు అవసరమైనా అప్పుడు నీటి పారుదల పథకాలు పెట్టుకున్నారు. ప్రజాధనం అంతా కేసీఆర్ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళిందని మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆదివారం, సోమవారం కూడా ప్రచారం నిర్వహించ నున్నారు. కాగా రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఖరీఫ్‌లో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొంటామని, ఇది తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేస్తుందని మోదీ హావిూ ఇచ్చారు. ఏళ్ల తరబడి వేలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వారి అక్రమాల వల్ల నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ సీఎం, కాంగ్రెస్ అధ్యక్షుడు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, వారి కుటుంబ పాలన, అవినీతి పాలన ఇక సాగదు అనేలా వారికి గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. ‘ వారిద్దరు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అక్కడ ఓడిపోతామనే భయంతో కామారెడ్డి వచ్చారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. డిసెంబర్ 3న ప్రజలు కేసీఆర్‌ను తరిమేసినట్లుగా తీర్పు రానుంది. విూ అందరి ఆశీర్వాదంతో మాకు 300 మంది ఎంపీలు ఉన్నారు. మేము బలహీనంగా ఉన్నపుడు విూరు అండగా ఉన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వారు తమ బిడ్డల భవిష్యత్తు కోసం పని చేస్తే.. మేము విూ బిడ్డల భవిష్యత్తు కోసం పని చేస్తాం అని ప్రధాని మోదీ చెప్పారు.