స్కూలు బస్సు ఢీ: ఐదేళ్ల బాలుడి మృతి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు బస్సు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహంతో బంధువులు ఆందోళనకు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.