స్కూల్ వ్యాను బోల్తా: విద్యార్థి మృతి
చెన్నై : చెన్నైలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పల్లవరం-తొరైపక్కం రేడియల్ రోడ్డు ఫ్లైఓవర్ వెళ్తున్న పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాఠశాల విద్యార్థి(14) తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బ్రిడ్జిపై నుంచి కిందకు వచ్చే క్రమంలో బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మిగిలిన విద్యార్థులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.