స్టార్టప్‌లో భవిష్యత్తు తెలంగాణదే
మంత్రి కేటీఆర్
హైదరాబాద్,జనవరి18(జనంసాక్షి):
స్టార్టప్‌లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూసుకు పోతోంది. ఈమేరకు గచ్చిబౌలీలో టీహబ్‌లో జరిగిన కార్యక్రమంలో నాస్కామ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పది వేల స్టార్టప్‌లకు నాస్కామ్ ముందుకు రావడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. పది వేల స్టార్టప్‌లతో ముందుకు వచ్చిన నాస్కామ్‌కు ధన్యావాదాలు తెలిపారు. యువత కల సాకారం అయ్యేందుకు టీ హబ్ వేదికైందని వ్యాఖ్యానిం చారు. ఇది ఓ మంచి పురోగతి అన్నారు. దీంతో తెలంగాణాలో ప్రబుత్వం ప్రోత్సాహకరంగా ఉందని తేలిందన్నారు. ఐటిలో మంచి ఫలితాలు సాధిస్తామని అన్నారు.