స్టార్‌ క్యాంపెనర్‌ నిర్ణయించేది పార్టీయే ..

– ఈసీకి ఎక్కడిది అధికారం?

– సుప్రీంను ఆశ్రయించిన కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి): రాష్ట్రంలో ఉప ఎన్నికల సందర్భంగా తన ”స్టార్‌ క్యాంపెయినర్‌” ¬దాను ఎన్నికల కమిషన్‌ రద్దు చేయడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీనియర్‌ వివిధ కారణాల వల్ల ఈసీ నిర్ణయాన్ని కమల్‌నాథ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారని, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ కోరనున్నట్లు న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు అయిన వివేక్‌ టాంకా తెలిపారు.’నైతిక, గౌరవప్రదమైన ప్రవర్తన”ను ఉల్లంఘించినట్లు గమనించిన పోల్‌ ప్యానెల్‌.. రాష్ట్రంలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కమల్‌నాథ్‌ ”స్టార్‌ క్యాంపెయినర్‌” ¬దాను ఎన్నికల కమిషన్‌ రద్దు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ శనివారం కమల్‌నాథ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.మోడల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కమల్‌నాథ్‌ ‘దోషి’గా తేలినందున స్టార్‌ క్యాంపెయినర్‌ ¬దాను కోల్పోయాడు. అతను మూడు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీజేపీకి చెందిన మంత్రి ఇమర్తి దేవిని ‘ఐటమ్‌’ అని పిలిచారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కమల్‌నాథ్‌కు నోటీసు ఇచ్చి ఆయన వివరణ కోరింది. పేరులేని రాజకీయ ప్రత్యర్థిని ”పిచ్చివాడు” అని పిలిచినందుకు 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఇమార్తి దేవికి నోటీసు జారీ చేసింది. ఇటీవల దాబ్రా ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి ఇమార్తి దేవిని ‘ఐటమ్‌’గా కమల్‌నాథ్‌ అభివర్ణించారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగించింది. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ విషయాన్ని లేఖ ద్వారా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుపై ఈసీ.. కమల్‌నాథ్‌ వివరణ కోరింది. అయితే ఆయన వివరణపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఈసీ.. ఆయన స్టార్‌ క్యాంపెయినర్‌ ¬దాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.