స్టీఫెన్‌కు రేవంత్ డబ్బులివ్వజూపుతున్న చిత్రం
రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం
హైదరాబాద్, మే 31(జనంసాక్షి) : ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తుండగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసులో . రూ. 50 లక్షలు ఇస్తున్నప్పటి దృశ్యం పక్కనే చూడొచ్చు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ రూ. 50 లక్షలు ఇస్తున్నాం. మరో రూ. నాలుగున్నర కోట్లు సోమవారం ఇస్తాం. రూ. 50 లక్షలను నలుపు రంగులో ఉన్న ట్రావెల్ బ్యాగులో తీసుకొచ్చారు. రేవంత్ తన వెంబడి వచ్చిన వ్యక్తికి ఇలా చెప్పారు. తొందర కానీయండి. పని ఉంది పోవాలె. తలుపు మూయండి అని చెప్పారు. విూకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిన నన్ను కాంటాక్ట్ అవ్వండి అని రేవంత్ స్టీఫెన్‌కు చెప్పారు. ఇక్కడ ఏదైనా జరిగితే ఏపీలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఇప్పిస్తా. ఏదన్నా జరిగితే పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా అని రేవంత్ చెప్పారు.
అవినీతి కేసులో శాసనసభ్యుడ్ని అనిశా అధికారులు అరెస్టు చేయడం ఈ మధ్యకాలంలో ఇదే ప్రథమం. మద్యం సిండికేట్ల వ్యవహారంలో అప్పటి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితోపాటు పలువురు శాసనసభ్యులపై కేసులు పెట్టినప్పటికీ వారి వాంగ్మూలాలు మాత్రమే నమోదు చేశారు. బెయిలు కుంభకోణం కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే గాలి సురేష్‌లను అనిశా అధికారులు అరెస్టు చేశారు.