స్టూడెంట్స్ ఆత్మహత్యలపై దర్యాప్తు : కడియం
హైదరాబాద్: విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన విద్యార్థుల ఆత్మహత్యలపై నేడు సమీక్ష నిర్వహించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడాలని విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులకు సూచించారు. యాజమాన్యాలు, తల్లిదండ్రులతో రేపు భేటీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యాసంస్థలో కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు విద్యాసంస్థల్లో తనిఖీలు చేయాలని సూచించారు.